తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలందరూ.. సేవ్ కాంగ్రెస్ పేరిట చిన్నపాటి ఉద్యమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వీరి ఉద్యమం.. పార్టీకి చిక్కుల్లో పడేస్తోందనే అనుమానంతో… అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపింది. కాగా… ఈ మేరకు తెలంగాణకు వచ్చిన ఆయన… పార్టీ నేతలందరికీ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.
అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడమే మంచిదని, బహిరంగ ఆరోపణలు వద్దే వద్దని తేల్చి చెప్పారు. మరో మారు ఇలాంటివి పునరావృతం కావొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ దిగ్విజయ్ సింగ్ అన్నారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంత పెద్ద నాయకుడి పైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజెపితో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ వైపు ప్రజలు ఆకర్షితులయ్యేలా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.