AP: పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్-1గా నిలవడం గర్వకారణమని మంత్రి డీఎస్బీవీ స్వామి అన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు. చంద్రబాబు, లోకేష్ కృషి వల్లే దిగ్గజ కంపెనీలు వస్తున్నాయని కొనియాడారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ఎన్ని పిటిషన్లు వేసినా పెట్టుబడుల ప్రవాహాన్ని ఆపలేకపోయిందని ధీమా వ్యక్తం చేశారు.