MNCL: ప్రత్యామ్నాయ పంటలే రైతులకు లాభం చేకూరుతుందని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మండలంలోని చాలా గ్రామాలలో రైతులు ఆయిల్ ఫామ్, తదితర పంటలను సాగు చేయడానికి ముందుకు వస్తున్నారన్నారు. దేవునిగూడెం, కామన్పల్లి, కిష్టాపూర్, మందపల్లి, రేండ్లగూడ, ధర్మారం, తదితర గ్రామాల్లో రైతులు 300 ఎకరాలలో ఆయిల్ ఫామ్ వేశారన్నారు.