SRPT: రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత పెరుగుతుండటంతో సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కన్పిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇదివరకు ఎన్నడులేని రీతిలో నమోదవుతున్నాయి. తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు పట్టపగలే చలిమంటలు వేసుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్న గాలుల వల్ల చలి పెరిగింది.