WGL: KMC సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో లిఫ్టులు పనిచేయకపోవడంతో రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు అంతస్తుల భవనంలో మొత్తం ఆరు లిఫ్టులు ఉండగా.. నాలుగు కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. మిగిలిన రెండింటిలో ఒకటి తాజాగా పాడైపోవడంతో అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అంతరాయం కలిగాయి. అధికారులు స్పందించి లిఫ్టులు మరమ్మతు చేయించాలని రోగులు కోరుతున్నారు.