KMM: నగరంలో నాణ్యమైన రోడ్లు డ్రైనేజీ పనులను సకాలంలో పూర్తి చేశామని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. నిరంతర పారిశుద్ధ్య పనులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. త్వరలో ప్రత్యేకంగా పెట్ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పారదర్శకతతో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.