ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చపూర్ గ్రామానికి చెందిన కృష్ణ ఇటీవల తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పస్రా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ఫోన్ను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఫోన్ను బాధితుడికి అందజేశారు. ఈ చర్యకు కృష్ణ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.