MDK: నాణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. విద్యలో మెదక్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు. హవేలీ ఘనాపూర్ మండలంలో డైట్ కళాశాల వద్ద కళాశాల భవనం, హాస్టల్ మెస్లకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రమాదేవి, ప్రిన్సిపాల్ రాధాకిషన్ పాల్గొన్నారు.