కృష్ణా: మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, పిప్పళ్ల వెంకన్న, AMC ఛైర్మన్ కుంచే నాని, మాజీ MPP కాగిత వెంకటేశ్వరరావు తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను మంత్రి రవీంద్ర దృష్టిలో పెట్టి పరిష్కరిస్తామని తెలిపారు.