గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమా ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘చికిరి’ పాట రిలీజై సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.