ATP: గార్లదిన్నె మండలం కల్లూరు ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కోన కులశేఖరరెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, నాయకుడు రామలింగారెడ్డి పాల్గొని ఆయనను సన్మానించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, కులశేఖరరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారని కేశవరెడ్డి కొనియాడారు.