MDK: తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. కిష్టాపూర్ సర్పంచ్ చుక్క హిమబిందు శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన తరగతుల కులాలకు ఉన్న హక్కులను వివరించి అవగాహన కల్పించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి రంగవ పాల్గొన్నారు.