కృష్ణా: ఏపీ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని కోరుతూ గుడివాడలో సీసీఎం ఆధ్వర్యంలో నిన్న నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి మాట్లాడుతూ.. అప్పలరాజుపై బనయించిన పీడీ యాక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ, రజిని తదితరులు పాల్గొన్నారు.