NZB: అడవికి నిప్పు-మానవాళికి చేటు అనే అంశంపై మోస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగాధర్ మాట్లాడుతూ.. అడవులను అగ్నికి ఆహుతి కాకుండా, నరికి వేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి కోటేష్, బీట్ అధికారి హుస్సేన్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.