SKLM: కాశీబుగ్గకు చెందిన డీ.షణ్ముఖరావు సైబర్ నేరగాళ్ల మోసానికి గురై రూ.1.30 కోట్లకు పైగా నష్టపోయినట్లు సీఐ వై.రామకృష్ణ మంగళవారం తెలిపారు. మార్చి 13న అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మానవ అక్రమ రవాణా కేసులో ఆయన పేరు ఉందని భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. మోసం జరిగినట్లు గ్రహించిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.