NTR: కంచికచర్లలో ఉదయం 6 గంటల నుంచే ముమ్మరంగా ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సచివాలయ సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఒకరోజు ముందుగా పెన్షన్లు పంపిణీ చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.