కరీంనగర్: 50 ఎకరాల సాగు భూముల కోసం వేసిన సీసీ రోడ్డుపై కొలగాని అనిల్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నగునూర్ రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్‌పై అప్రతిష్ట తెచ్చేందుకే ఈ కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ నిధులతో నిబంధనల ప్రకారమే రోడ్డు వేశారని, వాస్తవాలను గుర్తించి న్యాయం చేయాలని రైతులు కోరారు.