ప్రకాశం: ఎర్రగొండపాలెం పంచాయితీలో చెత్త తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్ ఆటోలను టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మంగళవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టినట్లు ఎరిక్షన్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.