W.G: కాళ్ళ మండలం కాళ్లకూరూ స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. ఈ సందర్భంగా మంగళవారం స్వామివారిని ఏపీఐఐసీ ఛైర్మన్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు కలవపూడి రాంబాబు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.