కృష్ణా: గుడివాడ అమ్మాయి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. దోహాలో జరుగుతున్న వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్స్‌లో కోనేరు హంపి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో హంపికి ఇది ఐదో పతకం కావడం విశేషం. ఈ మేరకు ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఆమె విజయాల పట్ల గుడివాడ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.