WGL: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో యూరియాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగి సీజన్ 2025–26లో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలకు కలిపి మొత్తం 1,12,345 ఎకరాల సాగుకు DES 28వ వరకు 14,375 టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 434 టన్నుల యూరియా కలదని తెలిపారు.