NGKL: అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో మండలంలోని బీఆర్ఎస్ మాజీ సర్పంచులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఏఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు. పట్టుబడిన వారిలో మాజీ సర్పంచులు కొమ్ము రాజయ్య, సుదర్శన్ ఉన్నారు.