SDPT: జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి,బోనాలతో మల్లికార్జున స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నరు.