NLG: కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రెండేళ్ల నుండి అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ బాధ్యతను మరిచారని అన్నారు. నిన్న యాదాద్రి నల్గొండ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేళ్లలో ఒక్క ఇల్లు, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని దుయ్యబట్టారు.