భుజంగాసనం (నాగుపాము భంగిమ) వెన్నెముకను బలపరుస్తుంది. ఛాతీ, భుజాలు, ఉదరభాగాలను సాగదీస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మెరుగైన శారీరక ఆరోగ్యం కోసం జీర్ణ అవయవాలను ప్రేరేపిస్తుంది. శ్వాసకోశ కండరాలను బలపరుస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది.