NLG పీఏసీఎస్, డీసీసీబీలకు పాలకమండళ్లను నామినేట్ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించి ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రతినిధుల స్థానంలో రాజకీయ కార్యకర్తలను నియమించడం సహకార వ్యవస్థకు హానికరమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారానే పాలకమండళ్లు ఏర్పడాలని స్పష్టం చేశారు.