NZB: వర్ని మండలంలోని పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ దర్గాను ఎస్ఐ వంశీ కృష్ణ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. దర్గా వద్దకు వచ్చే భక్తులకు వసతులను, సౌకర్యాలను స్థానిక డిప్యూటీ సూపరింటెండెంట్ జమాల్‌ను అడిగి తెలుసుకొన్నారు. జనవరి నెలలో జరిగే ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.