KRNL: జిల్లాలో విద్యుత్ సరఫరా, వోల్టేజ్ తదితర సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు స్థానిక విద్యుత్ భవనంలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ ఆర్. ప్రదీప్ కమార్ తెలిపారు. వినియోగదారులు 7382614308కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.