కృష్ణా: కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో దోమల చక్రం వల్ల ఏర్పడిన అగ్ని ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకొచ్చింది. రాణిగారితోట తారకరామనగర్‌కు చెందిన అనిల్‌కుమార్ తన కుమారుడు సమర్పణపాల్ (9)తో కలిసి నిద్రపోతున్నాడు. అంతకు ముందే వెలిగించిన దోమల చక్రం నిప్పు ప్రమాదవశాత్తు దుప్పటికి అంటుకుని మంటలు వ్యాపించాయి. ఘటనలో గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.