మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో రేషన్ కార్డుదారులకు సంబంధించి ఇప్పటివరకు 71 శాతం కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,21,569 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇంకా కేవైసీ చేయించుకోని కార్డుదారులు డిసెంబర్ 31వ తేదీ వరకు సమీప రేషన్ దుకాణాల్లో కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.