SRD: ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులపై మండలంలో సోమవారం ఉదయం 10 గంటలకు ‘ప్రజావేదిక’ ఉంటుందని ఎంపీడీవో మహేశ్వర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులపై ఎస్ఆర్పీ భద్రు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ చేపట్టారు. ఈ మేరకు డీఆర్పీలు తనిఖీ నివేదికను బహిర్గతం చేయనున్నారు. కావున సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కూలీలు హాజరుకావాలని కోరారు.