KMM: జిల్లాలో అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం సీపీ సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం తరలించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.