TG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనం కోసం భక్తులకు సుమారు 4 గంటల సమయం పడుతోంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.