ATP: జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆదివారం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ రమేష్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.