ADB: యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని బేల్లూరి అయ్యప్ప ఆలయ ప్రధానార్చకులు సంతోష్ అన్నారు. శనివారం రాత్రి నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో భాగంగా ‘మండల దీక్షగోని’ అయ్యప్ప భక్తి పాటల సీడీని ఆవిష్కరించారు. భక్తి పాటలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నగేష్, మధుకర్, గణేష్, దత్తు, తదితరులు పాల్గొన్నారు.