NLG: మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. జ్వరంతో చికిత్స పొందుతున్న గణేష్ (19) దాహంతో నీళ్లు అనుకుని ల్యాబ్లో ఉంచిన కెమికల్ తాగాడు. వెంటనే పరిస్థితి విషమించడంతో చికిత్స ఫలించలేదు. సిబ్బంది అజాగ్రత్తే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.