ములుగు జిల్లా మంగపేట మండలంలో ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు కోతుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరికాయలు, ప్రసాదాలు లాక్కుంటూ కోతులు దాడి చేస్తున్నాయి. దీంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ అధికారులు ఇవాళ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.