MDK: రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు, ఇతర అధికారులతో సమీక్షించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజల జీవితాలను కాపాడడానికి అధికారులు ప్రజలు కలిసి పనిచేయాలన్నారు.