SRPT: తుంగతుర్తి మండలంలోని బండరామారం, సూర్యతండ, మంచ్యతండాకు SRPT డిపో నుంచి నూతనంగా ప్రారంభమైన బస్సు సర్వీసును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని బండరామారం సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్ కోరారు. శనివారం గ్రామానికి చేరుకున్న బస్సుకు గ్రామస్తులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిపో అసిస్టెంట్ మేనేజర్ బానోతు సైదులు మాట్లాడారు.