E.G: బీసీ వెల్ఫేర్ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఎస్.సత్యనారాయణ శనివారం రాజమండ్రిలో ఉన్న కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పారిశుధ్యం, భద్రత తదితర అంశాలను పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.