ELR: శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా వర్థిల్లాలని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ఆకాంక్షించారు. ఏలూరు ఆర్.ఆర్.పేటలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి త్రిశప్తాహ బ్రహ్మోత్సవ వేడుకల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి విశేష పూజ కైంకర్యాలు జరిపించారు.