MBNR: జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి సమీపంలో జిల్లా కోర్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ శనివారం భూమిపూజ చేశారు. పండితులు వేదమంత్రాలు పఠిస్తూ కార్యక్రమం నిర్వహించారు. వారితోపాటు జిల్లా సెషన్ న్యాయమూర్తి ప్రేమలత, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి తదితరులు పాల్గొన్నారు.