SRCL: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో గడ్డం మల్లేశం చెందిన టిఫిన్ సెంటర్లో ఇవాళ ప్రమాదవశాత్తు సిలిండర్ నుండి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన బ్లూకోల్ట్ సిబ్బంది పీసీ MD. సమీ, హెచ్. జి. నజీర్‌లు ప్రమాద సంఘటన స్థలంకి వెళ్లి మంటల్ని ఆర్పి వేశారు.