బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. పేసర్లకు అనుకూలమైన మెల్బొర్న్ పిచ్‌పై 32.2 ఓవర్లలోనే 175 రన్స్ లక్ష్యాన్ని ఛేదించి మరోసారి తన బజ్‌బాల్ మార్క్ చూపించింది. యాషెస్ సిరీస్ కోల్పోయినా.. ఈ విజయంతో క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. కాగా 2011 సిడ్నీ టెస్టు తర్వాత ఆస్ట్రేలియాలో ENGకు ఇదే తొలి గెలుపు. ఈ క్రమంలో ఆ జట్టు వరుసగా 18 టెస్టులు ఓడింది.