మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,901 మంది రైతుల నుంచి 10,593 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల మొత్తం విలువ సుమారు రూ. 25.3 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రూ. 17.4 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.