RR: షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఎస్బీపల్లి గ్రామంలో వైభవంగా అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సొంత ఖర్చులతో ఉప సర్పంచ్ గణేష్ అయ్యప్ప స్వామికి పల్లకి అందజేశారు. అనంతరం పల్లకి సేవలో పాల్గొన్నారు. అయ్యప్ప శరణు ఘోషతో ఎస్బీపల్లి గ్రామం మారు మ్రోగింది. పల్లకి సేవలో అయ్యప్ప భక్తులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.