VZM: జనవరి మొదటివారంలో సోలార్ రూఫ్‌టాప్ పథకంను ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. జిల్లాలో ఈ పథకం అమలును మరింత వేగవంతం చేసి ప్రజలకు విస్తృతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు పెంచి, దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయాలన్నారు.