PDPL: ఓదెల మండల కేంద్రంలోని తారకరామా కాలనీ పరిధిలో ఉన్న 32వ నంబర్ రైల్వే గేటు వద్ద రైల్వే లైన్ మరమ్మతులు చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనుల నేపథ్యంలో ఇవాళ నుంచి జనవరి 1 వరకు సాయంత్రం వరకు రైల్వే గేటును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి సహకరించాలని పేర్కొన్నారు.