HYDలోని భారత్ బయోటెక్ టీబీ (క్షయ) వ్యాధి నివారణకు కొత్త టీకా అభివృద్ధిపై కసరత్తు చేస్తోంది. MTB వ్యాక్ పేరుతో ఈ టీకాను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ప్రారంభంలో మూడు దశల క్లినికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ తెలిపారు. ఈ టీకా అభివృద్ధి కోసం గత మూడు సంవత్సరాలుగా బయో ఫ్యాబ్రి సంస్థతో కలిసి పరిశోధనలు చేస్తారు.