NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 28 వ తేదీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు MPDO నూర్జహాన్ శుక్రవారం తెలిపారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన 19వ విడత సామాజిక తనిఖీల్లో గుర్తించిన అంశాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు హాజరుకావాలని ఆమె కోరారు.